తాండూరు వైద్యుడికి ఉత్త‌మ అవార్డు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

తాండూరు వైద్యుడికి ఉత్త‌మ అవార్డు
– డాక్ట‌ర్ శ‌ర‌త్‌చంద్ర‌కు ద‌క్కిన గౌరవం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరుకు చెందిన యువ వైద్యులు డాక్ట‌ర్ శర‌త్‌చంద్ర‌కు ఉత్త‌మ అవార్డు ద‌క్కింది. సీనియర్ వైద్యులు, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో యాక్టి నౌ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రస్థాయిలోని ఉన్నత విద్యావంతుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో నిరుపేదలకు నాణ్యమైన వైద్యంను అందిస్తున్న ఉత్తమ వైద్యులను గుర్తించి వారిని సన్మానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆదివారం హైద‌రాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు డాక్టర్ అబ్దుల్ కలాం ఎక్స్ క్యూట్ హెల్త్ అవార్డ్స్ పేరిట వైద్యులను ఘనంగా సన్మానించి ఉత్తమ వైద్యుల అవార్డులను అందించింది. ఇదే వేదిక‌పై తాండూర్ పట్టణానికి చెందిన ఆదిత్య అసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర భీంసెట్టికు కూడ ఉత్త‌మ అవార్డును అంద‌జేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ
ఈ అవార్డు నాపై మరింత బాధ్యతను పెంచింది అని అన్నారు. రాబోయే కాలంలో తన వంతుగా మ‌రిన్ని మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తాన‌ని అన్నారు. మ‌రోవైపు యాక్ట్ నౌ సంస్థ ద్వారా తాండూర్ పట్టణంలో సేవలందించిన శరత్ చంద్ర ఎంపిక కావడం తాండూర్ చరిత్రలోనే ఒక గొప్ప విషయం అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.