జోహార్.. సుభాష్ చంద్రబోస్..!
– తాండూరులో ఘనంగా జయంతి
– నేతాజీ యూత్ ఆధ్వర్యంలో నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జోహార్.. సుభాష్ చంద్రబోస్ అంటూ పలువురు స్వాతంత్ర సమర యోధుడు నేతాజీకి జోహార్లు అర్పించారు. గురువారం తాండూరులో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోష్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తాలో ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దె శస్వాతంత్రం కోసం పొరాడిన మహాయోదుడని కొనియాడారు.
దేశ స్వాతంత్రం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి ఆజాద్ హింద్ పౌజ్ను స్థాపించారని గుర్తుచేశారు. “మీరక్తాన్ని ధారపోయండీ.. మీకు స్వాతంత్రాన్ని ఇప్పిస్తాను” అంటూ ఆయన నినాదాలు యువకులను ఉత్తేజ పరిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా 1984లో నేతాజీ యూత్ క్లబ్ స్థాపించి.. 1987లో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు ఆయన కలలను, ఆశయాలకు అణుగుణంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోమశేఖర్, సభ్యులు కోటం సిద్ధలింగం, విజయ్ కుమార్, ఘనాపూర్ శంకర్, కోటం రాజశేఖర్, దాదాపురం సతీష్ కుమార్, బీదర్ రాజశె ఖర్. యువకులు సందీప్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

