రూ. 35 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్ల సీజ్

క్రైం తాండూరు వికారాబాద్

రూ. 35 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్ల సీజ్
– ర‌వాణా దారుడిపై కేసు న‌మోదు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: నిషేధిత గుట్కా ప్యాకెట్ల‌ను త‌ర‌లిస్తున్న ర‌వాణా దారుడిని పెద్దేముల్ పోలీసులు అరెస్టుచేశారు. అత‌ని వ‌ద్ద నుంచి రూ. 35 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్ల‌ను స్వాదీనం చేసుకున్నారు. పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ ర‌వూఫ్ తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. శుక్ర‌వారం మండ‌లంలోని ఇందూరు గ్రామ సమీపంలో తాండూరు మండ‌లం అంతారం గ్రామానికి చెందిన డి.అంజ‌య్య బైక్ పై గుట్కా ప్యాకెట్ల‌ను త‌ర‌లిస్తున్న స‌మాచారం అందింది. ఈ మేర‌కు నిఘా ఉంచి అత‌నిని సోదా చేయ‌గా రూ. 35,000 విలువైన నిషేధిత‌ గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వాటితో పాటు అంజయ్య‌ను అదుపులోకి తీసుకుని పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈమేర‌కు గుట్కా ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకుని అత‌నిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎస్ఐ అబ్ద‌ల్ ర‌వూఫ్ తెలిపారు.