బ్యాంకులకు 13 రోజులు సెలవులు
– పండగలు, ప్రభుత్వ హాలీడేస్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఆగస్టు నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పండుగలు జరుపుకోబోతున్నారు. ఇందులో స్వాతంత్ర్య దినోత్సవం 2022, రక్షాబంధన్ 2022, జన్మాష్టమి 2022 వంటి పండుగలు ఉన్నాయి. దీంతోపాటు ఆగస్టులో శని, ఆదివారాలు రావడంతో ఈనెలలో రిజర్వ్ బ్యాంకు పరిధిలోని బ్యాంకులు మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు లావాదేవీలు ప్రతిఒక్కరూ చేస్తూ ఉంటారు. దీంతో బ్యాంకులు ఏ రోజు పని చేస్తాయనే విషయాన్ని అందరూ తెలుసుకుంటూ ఉంటారు.
ఈ రోజుల్లోనే బ్యాంకుల మూత
ఆగస్ట్ 1 – ద్రుపక్ షే జి ఫెస్టివల్ (గ్యాంగ్‌టక్), ఆగస్ట్ 7 – ఆదివారం, ఆగస్ట్ 9 – మొహరం, ఆగస్ట్ 11 – రక్షాబంధన్, ఆగస్ట్ 13 – రెండో శనివారం, ఆగస్ట్ 14 – ఆదివారం, ఆగస్ట్ 15 – ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 16 – పార్సి న్యూ ఇయర్ (ముంబై, నాగ్‌పూర్‌లో హాలిడే), ఆగస్ట్ 19 – జన్మాష్టమి, ఆగస్ట్ 21 – ఆదివారం, ఆగస్ట్ 27 – నాలుగో శనివారం, ఆగస్ట్ 28 – ఆదివారం, ఆగస్ట్ 31 – గణేశ్ చతుర్థి.


