సైన్స్ టీచర్ సస్పెండ్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సైన్స్ టీచర్ సస్పెండ్..!
– మెదడు చూపించి బోధించినందుకు చర్యలు
– ఆవు మెదడే అని ప్రాథమిక నిర్ధారణ..?
– చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల సైన్స్ టీచర్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠశాలకు చెందిన సైన్స్ టీచర్ ఖాశీంబీ మంగళవారం పాఠశాలలో 10 తరగతి విద్యార్థులకు మెదడు పనితీరును వివరించేందుకు ఆవు మెదడును తీసుకవచ్చి వివరించడంతో బుధవారం బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ నగేష్, యాలాల ఎస్ఐ గిరి, పోలీసులు ఆందోళన కారులను నియంత్రించారు. విద్యార్థులకు ఆవు మెదడుతో బోధన చేయడం పట్ల విద్యాశాఖ అధికారి సీరియస్ అయ్యారు.

దీంతో సైన్స్ టీచర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సైన్స్ టీచర్ తీసుకవచ్చిన మెదడు ఆవుదే అని ప్రాథమిక నిర్ధారణ అయినట్లు తెలిసింది. సైన్స్ టీచర్ ఆవు మెదడును ఎక్కడి నుంచి తీసువచ్చారని విచారించి.. ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

ఇదికూడా చదవండి…

దేశానికి సేవలు అందించడమే ఆర్బీఓఎల్ లక్ష్యం