కంగ్రాట్స్ రాజుగౌడ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కంగ్రాట్స్ రాజుగౌడ్..!
– గ్రంథాల‌య చైర్మ‌న్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు
– మంత్రి కేటీఆర్‌ను స‌న్మానించిన చైర్మ‌న్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కంగ్రాట్స్ రాజుగౌడ్ అంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్‌ను అభినందించారు. మంగ‌ళ‌వారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ ద్వారా హైద‌రాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను రాజుగౌడ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గ్రంథాల‌య చైర్మ‌న్‌గా నియ‌మించ‌డం ప‌ట్ల మంత్రి కేటీఆర్‌ను రాజుగౌడ్ స‌న్మానించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంత‌కుముందు గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్‌గా నియామ‌క‌మైన రాజుగౌడ్‌కు కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పి అభినందించారు. ఈ సంద‌ర్భంగా రాజుగౌడ్ జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాల‌ని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించిన‌ట్లు రాజుగౌడ్ తెలిపారు.