శ్రీవారి సేవలో శంకర్ యాదవ్
– ఉత్తర ద్వారంతో స్వామి వారి దర్శనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తరించారు. గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారిని ఉత్తర ద్వారం గుండ దర్శించుకున్నారు. తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌లో శ్రీ దేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా భావనోళ్ల శంకర్ యాదవ్ దేవాలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలో వెలసిన సతీసమేత శ్రీ శ్రీదేవి, భూదేవి, శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తాండూరు ప్రజలను భక్తులను సుభిక్షంగా చూడాలని స్వామి వారిని వేడుకున్నారు. కరోనా, ఒమిక్రాన్ మహమ్మారిలు అంతమై పోవాలని ప్రార్థనలు చేసినట్లు శంకర్ యాదవ్ తెలిపారు. ఆయన వెంట సన్నిహితులు మనోహర్ యాదవ్, ప్రేమ్ రాజ్, అంతారం ఎంపీటీసీ శాంతు, వడ్డె సుబ్బారావు తదితరులు ఉన్నారు.

