కంగారు పెట్టిన కుర్రాడు..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

కంగారు పెట్టిన కుర్రాడు..!
– సీటు కోసం అస్కార్ లెవ‌ల్ యాక్టింగ్
– సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
– మీరు ఈ వీడియోను ఓ లుక్కేయండి
ద‌ర్శిని డెస్క్ : బ‌స్సులు, ఆటోలో ప్ర‌యాణించేట‌ప్పుడు కుర్చీ దొరికితే చాలు అనుకుని ర‌వాణా సాగిస్తాం. కొంద‌రు ఆక‌తాయిలు ఎలాగైనా సీటులో కూర్చున్న వారిని లేపి అందులోకూర్చునేందుకు లేనిపోని టెక్నిక్‌లు వాడుతారు. కొన్ని సార్లు కొంద‌రికి కోపం తెప్పించినా.. కొన్ని సార్లు న‌వ్వుతెప్పిస్తాయి. అలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎంతలా అంటే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. అలాగే 88వేల మందికి పైగా ఈ వీడియోను లైక్‌ చేశారు. నేటి కాలంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి మెట్రో అత్యంత అనుకూలమైన మార్గంగా మారింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారికి మెట్రో కంటే మరో మెరుగైన మార్గం కనిపించడంలేదు. కానీ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం మెట్రోలో అడుగుపెట్టేందుకు ఒక్కోసారి స్థలం కూడా దొరకదు. ఇలాంటి సమయాల్లో సీట్లు దొరకడం ఇక గగనమే. దీంతో చాలా మంది నిల్చుని ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్య బాధితులు నిల్చొని ఇబ్బంది పడకూడదని కొందరు వారికి సీట్లు ఇస్తుంటారు. అస‌లు విష‌యానికి వ‌స్తే ఒక యువకుడు మెట్రో రైలెక్కాడు. అప్పటికే సీట్లన్ని ఆడవాళ్లతో నిండిపోయాయి. కూర్చోవాలి కానీ సీటు ఖాళీగా లేదు కాబట్టి అతనికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే అకస్మాత్తుగా మూర్ఛ వచ్చినట్లు నటించడం ప్రారంభించాడు. అప్పటివరకు ఎంతో దర్జాగా నిలుచన్న వ్యక్తి గజగజా వణకడం చూసి అక్కుడున్న వారందరూ భయపడ్డారు. ఎదురుగా కూర్చున్న ఆడవాళ్లందరూ అక్కడి నుంచి లేచి పక్కకు పారిపోయారు. ఆ తర్వాత ఆ యువకుడు ఖాళీ అయిన సీటులో తీరిగ్గా కూర్చున్నాడు. అదే సమయంలో ప్రయాణికులందరూ అతని చర్యను చూసి ఆశ్చర్యపోయారు. మెట్రోలో సీటు కోసం భారీ స్కె్చ్ వేసి. చుట్టూ కూర్చున్న వాళ్లందరినీ బకరా చేసి ఏకంగా 2-3 సీట్లు సంపాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. raaj_official09 అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ మెట్రో సీటు కోసం అందరినీ కంగారు పెట్టించావ్‌ కదరా’ అని కొందరు కామెంట్ చేస్తే.. ఈ ప్లానేదో బాగుందే అంటూ మరికొందరు యువకుడి టెక్నిక్‌ను ప్రశంసిస్తున్నారు.

https://www.instagram.com/p/CifMmLXBY8r/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again