నేడు, రేపు స్కూళ్లకు సెలవు

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

నేడు, రేపు స్కూళ్లకు సెలవు
– భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం
– ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు నేడు, రేపు సెలవు ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపధ్యంలో.. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని మంత్రి సబితా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ స్కూల్స్‌కు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించింది. మరోవైపు ప్రైవేటు స్కూళ్లు సైతం స్వచ్చంధ సెలవులను ప్రకటించుకున్నారు. మంత్రి సబితారెడ్డి ప్రకటించిన ట్విట్టర్ లింక్ కింద ఉంది చూడండి..

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage