క‌దిలే ఇల్లు భ‌లే..!

టెక్నాలజీ తాండూరు వికారాబాద్

క‌దిలే ఇల్లు భ‌లే..!
– కంటైన‌ర్‌పై క‌దిలొచ్చిన రెడీమేడ్ హౌస్
– ఆస‌క్తిగా తిల‌కించిన ప్ర‌జ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఎవ‌రికైనా సొంత ఇల్లు నిర్మించుకోవ‌డం మ‌రిచిపోని క‌ల‌. ఇందుకోసం స్థ‌లం కొన‌డం.. ఆపై ఇల్లు నిర్మాణం చేసుకోవ‌డం.. భారీగా ఖ‌ర్చులు పెట్ట‌డం సాధార‌ణ‌మే. తీరా నిర్మించుకున్న ఇంటిని వ‌దిలి వేరే ప్రాంతానికి వెళ్ల‌డం.. అమ్మేసుకోవ‌డం వారికి తీర‌ని బాధే. మారుతున్న కాలానికి అనుగుణంగా అభిరుచికి ద‌గ్గ‌ర‌గా త‌క్కువ ఖ‌ర్చుతో కదిలే ఇళ్ల‌ను నిర్మించుకునే సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో అక్క‌డక్క‌డ క‌నిపిస్తున్నాయి. వీటినే రెడీమేడ్ ప్రీ ఫాబ్రికేటెడ్ మొబైల్ హౌస్ అని పిలుస్తుంటారు. ఇలాంటి క‌దిలే ఇళ్లు తాండూరు మీదుగా త‌ర‌లిస్తుండ‌గా ద‌ర్శ‌నమిచ్చింది. తాండూరు ప‌ట్ట‌ణం మీదుగా పెద్దేముల్ వైపు ఇంటిని త‌ర‌లించారు. భారీ కంటైన‌ర్‌పై త‌ర‌లించిన క‌దిలే ఇల్లు ప్ర‌జ‌ల‌ను అబ్బుర ప‌రిచింది. అలా కంటైన‌ర్‌పై వెళుతున్న ఇంటిని చూసిన వారంతా క‌దిలే ఇల్లు భ‌లేగా ఉందే అంటూ ఆస‌క్తిగా తిల‌కించారు. ఈ ఇంటిలో బెడ్ రూం, కిచెన్, హాల్ గ‌దులు ఉన్న‌ట్లు క‌నిపించింది. త‌క్కువ విస్తీర్ణంలో.. త‌క్కువ ఖ‌ర్చుతో రెడీమేడ్ హౌస్‌ల‌ను నిర్మించుకోవడం సాధ్య‌మ‌వుతుంద‌ని ప‌లువురు ఇంజ‌నీర్లు తెలిపారు.