బైరి దొరికేశాడు..!
– వరంగల్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి కారణమైన భైరి నరేష్‌ను పోలీసులు పట్టుకున్నారు. వెంటనే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అయ్యప్ప స్వాములు, హిందూ బంధువులు, రాజకీయ నేతలు భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో భైరి నరేష్‌పై సులు నమోదయ్యాయి. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై శుక్రవారం కొడంగల్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బైరి నరేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పరారీలో ఉన్న నరేష్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. పరారీలో ఉన్న నరేష్‌ను వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే కోడంగల్ పోలీస్టేషన్‌లో నమోదైన కేసులతో బైరి నరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. కేసు నమోదైన 24 గంటల్లో బైరీ నరేష్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అతనితో పాటు సమావేశాన్ని నిర్వహించిన డోలు హన్మంతును కూడ అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.


