మెరుగైన వైద్య సేవలే లక్ష్యం..!

ఆరోగ్యం తెలంగాణ రాజకీయం వికారాబాద్

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం..!
– జిల్లా ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి కృషి
– ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించారు. రోగులతో స్వయంగా మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవల రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాధుల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రికి సందర్శించినట్లు తెలిపారు. సర్కారు ఆసుపత్రి కూడా దేవాలయం లాంటిదే అని అన్నారు.* ఆసుపత్రిలో ఉత్తమ వైద్యులు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రజలు, రోగులు నమ్మకంతో ఆసుపత్రికి వచ్చి సేవలను పొందాలన్నారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో వైద్యుల పోస్టులను భర్తి చేసేందుకు సంబందిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు.

వైద్య పోస్టులతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. దీంతో పాటు ఆసుపత్రిలో నిర్వహణకు నిధుల కొరతను తీరుస్తామన్నారు. ఆసుపత్రిలో సిటీస్కాన్ సేవలపై వస్తున్న ఫిర్యాదులపై దృష్టిపెడతామన్నారు. ఎవరినైనా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో అంబులెన్స్ అవసరముందని కోరగా మాజీ లైబ్రరీ చైర్మన్ మురళీగౌడ్ విరాళంగా అందిస్తామని చెప్పడంతో అభినందించారు. ఆసుపత్రిలో వైద్యులు సమమ పాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు.

మరోవైపు ఆసుపత్రిలో వైద్యుల ఖాళీలు, మౌళిక సదుపాయాలు కల్పించాని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్’ విక్రమ్ సింహారెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్ డా. మూర్తి. వైద్యులు డా.రమణబాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జుబేర్ లాల, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

నూనే, సబ్బులు ఇవ్వరా…!