నూకల బియ్యం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్
– కేంద్రం నిర్ణయంతో రైతులకు ఉపశమనం
దర్శిని డెస్క్ : నూకల బియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో నూకల బియ్యంపై కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 8 నుంచి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గత నెల ప్రారంభం నుంచి నూకల బియ్యం ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఈ నిషేధంలో సడలింపు కల్పిస్తున్నట్లు బుధవారం ఓ ఉత్తర్వులో పేర్కొంది. పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చైనా తర్వాత భారతదేశం వరిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం. ప్రపంచ బియ్యం వ్యాపారంలో 40 శాతం వాట భారత్‌దే. పారా బాయిల్డ్ రైస్ మినహా బాస్మతీయేతర బియ్యంపై ప్రభుత్వం 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ సరఫరాను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. సెప్టెంబర్ 8కి ముందు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సి) మద్దతుతో 3,97,267 టన్నుల విరిగిన బియ్యాన్ని(నూకల) రవాణా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8 సెప్టెంబర్ 2022లోపు ఒప్పందం కుదుర్చుకున్న లేదా ఆర్డర్ చేసిన నూకలను కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేయవచ్చని పేర్కొంది. అయితే.. ప్రభుత్వం ఎగుమతి చేయడానికి గడువు 31 మార్చి 2023 అంటే మీరు వచ్చే ఏడాది మార్చి నెలలోపు ఎగుమతి చేయవచ్చు. కాని వివిధ రకాల బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం ఎగుమతిపై నిషేధం పరిధిని మరింత పొడిగించే అవకాశం ఉంది.

