కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జయప్రదం చేయండి
– రేపు తాండూరు పట్టణంలోని కార్యాలయంలో సమావేశం
– పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ పట్టణ అద్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. రేపు బుధవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూరు పట్టణం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఏం రమేష్ మహారాజు, ప్రధాన కార్యదర్శి పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్తో పాటు సీనీయర్ నాయకులు హాజరవుతున్నారని చెప్పారు. కావున సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు, మహిళా నాయకులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

