చదివిన పాఠశాలపై మమకారం..!
– విద్యార్థులకు ప్యాడ్‌లు, పెన్నులు, బాటిల్స్ వితరణ
– తండ్రి స్మారకార్థం అందజేసిన ఉపాధ్యాయులు
యాలాల, దర్శిని ప్రతినిధి: తాము చదువుకున్న పాఠశాలపై పూర్వ విద్యార్థులు, ప్రస్తుత ఉపాధ్యాయులు మమకారం చాటుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్‌లు, పెన్నులు, వాటర్ బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. యాలాల మండలం కోకట్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, సీయూపీఎస్ పాఠశాలలో స్వర్గీయ మర్పల్లి బాలప్ప కుమారులు మర్పల్లి వెంకటప్ప, మర్పల్లి అశోక్‌లు చదువుకున్నారు. ప్రస్తుతం వారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే శనివారం వారి తండ్రి స్వర్గీయ మర్పల్లి బాలప్ప జ్ఞాపకార్థం చదువుకున్న పాఠశాలల్లో విద్యార్థులుకు పరీక్షా ప్యాడ్‌లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందించి మమకారం చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుమారుడు పురుషోత్తం రెడ్డి, ఉప సర్పంచ్ జోగు కృష్ణ, మాజీ ఎంపిటిసి శంకర్, పాఠశాల సిబ్బంది వారిని అభినందించారు. అదేవిధంగా మర్పల్లి అశోక్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా విద్యార్థులతో పాటు ఇతర కార్యక్రమాలకు చేయూత అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాతలు మర్పల్లి వెంకటప్ప, మర్పల్లి అశోక్, బాలమణి,రాజ్ కుమార్, పండు, సుదిక్ష, పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు సురేష్ రావు, వీరేశం, రవి, బుజ్జమ్మ, అరుణ, భాగ్యమ్మ, సరళ, సావిత్రమ్మ, వెంకటమ్మ, గ్రామ వార్డు సభ్యులు యాదప్ప, అర్కల బలరాం, అర్కల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

