ఏనుగుకు పదవి విరమణ

కెరీర్ జాతీయం తెలంగాణ హైదరాబాద్

ఏనుగుకు పదవి విరమణ
– భావోద్వేగానికి గురైన అధికారులు
– వైరల్‌ అవుతున్న వీడియో
దర్శిని డెస్క్‌: ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు పదవి విరమణకు గురైతే భావోద్వేగానికి లోనైన దృశ్యాలు ఎన్నో చూశాం. కాని ఓ ఏనుగు పదవి విరమణకు గురైతే ప్రభుత్వ అధికారులు భావోద్వేగానికి గురైయ్యారు. బాధాతత్ప హృదాయాలతో అందించిన వీడ్కోలుకు ఏనుగు సైతం ప్రతికూలంగా స్పందించింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తమిళనాడులో గాయపడిన లేదా ఇతర ప్రమాదాల్లో చిక్కుకున్న ఏనుగులను రక్షించేందుకు ప్రత్యేకంగా ఏనుగులకు శిక్షణ ఇస్తారు. అలాంటి శిక్షణ పొందిన ఏనుగులను కుమ్కీ ఏనుగులు అంటారు. వివిధ రెస్క్యూ ఆపరేషన్లలో అటవీ అధికారులు ఈ ఏనుగులను ఉపయోగిస్తారు. ఆ రాష్ట్రంలోని కోజియాముట్టి ఏనుగు శిబిరానికి చెందిన ‘కలీమ్‌’ అనే కుమ్కీ ఏనుగు(60 ఏళ్ల వయసు)కు మంగళవారం (మార్చి 7) నాడు పదవీ విరమణ నిర్వహించారు. పదవీ విరమణ సందర్భంగా అటవీ అధికారులు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్‌) చేశారు. కలీమ్‌ దాదాపు 99 రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొని అందరి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం అటవీశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియలో పోస్టు చేశారు. ‘కుమ్కీ ఏనుగు ‘కలీం’ ఈ రోజు పదవీవిరమణ పొందింది. తమిళనాడులోని అనమలై టైగర్ రిజర్వ్‌లోని 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న కలీం ఓ లెజెండ్‌. కలీమ్‌ పదవీ విరమణ చేస్తుంటే మా కళ్లు చెమ్మగిల్లాయి. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయని’ సుప్రియా సాహు తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వీడియోలో పోలీసధికారులు అందరూ ఏనుగు ముందు నిలబడి సెల్యూట్‌ చేయడం కనిపిస్తుంది. వెంటనే ఏనుగు ఘీంకరిస్తూ తొండం పైకెత్తి అది కూడా వందనం చేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో కోసం కింద లింకును క్లిక్‌ చేయండి..