జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు
– వికారాబాద్‌ జిల్లా విలేకరులకు మంత్రి సబితారెడ్డి హామి
– టీయూడబ్ల్యూజే-ఐజేయు డైరీ ఆవిష్కరించిన మంత్రి
వికారాబాద్, దర్శని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శుభవార్త చెప్పారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆదివారం టీయూడబ్ల్యూజే-ఐజేయు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి, శ్రీధర్‌ల వికారాబాద్ జిల్లా 2023 డైరీని మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సహాకారంతో త్వరలోనే అర్హులైన విజేకరులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని అన్నారు. ఇందుకు గాను జర్నలిస్టుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జర్నలిస్టు సమస్యలను పరిష్కారించడం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఆదేవిధంగా టీయూడబ్ల్యూజే-ఐజేయు వికారాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి, శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి మంత్రి స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో జిల్లాలోని జర్నలిస్టుల తరఫున ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులలో రాయితీ కల్పించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డి.ఆనంద్, పి.చుక్కయ్య, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ జాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.