చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళులు అర్పించిన నాయకులు

తాండూరు వికారాబాద్

చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాక‌లి ఐల‌మ్మకు తాండూరు టీఆర్ఎస్ నాయ‌కులు నివాళులు అర్పించారు. శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలోని వీవీహెచ్ఎస్ స్కూల్ వ‌ద్ద‌ చాక‌లి ఐల‌మ్మ 36 వ‌ర్దంతి సంద‌ర్భంగా ర‌జ‌క సంఘాల ఆధ్వ‌ర్యంలో టీఆర్ఎస్ నాయ‌కులు సంతోష్‌గౌడ్, న్యాయ‌వాది గోపాల్, రాజ‌న్‌గౌడ్, యువ‌నాయ‌కులు ఇంతియాజ్, బీసీ సంఘం నాయ‌కులు అబ్బ‌ని బ‌స‌య్య‌, గంజ్ హామాలీ కార్మిక సంఘం నాకులు భ‌ద్రు త‌దిత‌రులు ఐల‌మ్మ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాక‌లి ఐల‌మ్మ చేసిన ఉద్య‌మాల‌తో అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచార‌ని పేర్కొన్నారు. ప్రజా సంఘాల నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు