గురుకులాల్లో కార్పొరేట్ విద్య

తాండూరు రాజకీయం వికారాబాద్

గురుకులాల్లో కార్పొరేట్ విద్య
– జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి
– తాండూరులో కేక్ కట్ చేసిన జడ్పి చైర్ పర్సన్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ గురుకులాల్లో కార్పొరేట్ తరహాలో విద్యాభ్యాసం, వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినం సంధర్బంగా తాండూరు లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమ‌ళ్, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి కేక్ కటచేసి సీఎం కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జడ్పి చైర్ పర్సన్ గురుకులల్లో చదువుకున్న విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్స్, సివిల్స్ లోను రాణిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే విద్యావ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు.
ఈ సంధర్బంగా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం పై పోస్టర్ ను విడుదల చేసి చేతిసంచులను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు నీరజా రెడ్డి, రాము, ప్రవీణ్ గౌడ్, వెంకన్న నాయకులు జుబేర్ లాల తదితరులు పాల్గొన్నారు.