రెండో రోజు హిందీ క్వశ్చన్ పేపర్ లీక్
– 9-30 గంటలకే వాట్సాప్‌లో చక్కర్లు
– కొనసాగుతున్న క్వశ్చన్ పేపర్ లీక్స్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీక్స్ కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడ పేపర్ లీక్ కావడం సంచలనంగా మారింది. నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ లీక్ అవ్వగా.. ఇవాళ వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. ఇవాళ హిందీ క్వశ్చన్ పేపర్ ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ లీక్ అయినట్లు పేర్కొంటున్నారు.
రెండు రోజు మంగళవారం కూడా హిందీ పేపర్ లీక్ అవ్వడం పెను సంచలనానికి దారితీసింది. హిందీపేపర్ లీక్‌తో తెలంగాణ పదోతరగతి పరీక్షలు రెండోరోజూ వార్తల్లోకి వచ్చాయి. లీక్ అయిన హిందీ పేపర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇది లీక్ కాదు, జస్ట్ సర్క్యులేట్ అంటూ అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. వరుసగా పేపర్లు లీక్ అవుతుండటంతో అటు విద్యార్థులు.. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అసలు పేపర్లు బయటకు ఎలా వస్తున్నాయో మాత్రం మిస్టరీగా మారింది.

