గురుకులాల్లో కొలువుల జారత

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

గురుకులాల్లో కొలువుల జారత
– 9,231 పోస్టుల భర్తికి నోటిఫికేషన్‌
– దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి అంటే
హైదారాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో కొలువుల జాతర ఏర్పడింది. ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. ఆయా గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషలన్లు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (TREIRB) గురువారం (ఏప్రిల్‌ 6) ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో డిగ్రీ కాలేజీల్లో 868 లెక్చరర్‌/ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. టీజీటీ పోస్టులు 4,020, జూనియర్‌ కాలేజీల్లో 2008 జూనియర్‌ లెక్చరర్/ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌ పోస్టులు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌, 4020 లను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 12 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డా మల్లయ్య భట్టు తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 17వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.