వ‌జ్రోత్స‌వంలో వ‌నోత్స‌వం

తాండూరు రాజకీయం వికారాబాద్

వ‌జ్రోత్స‌వంలో వ‌నోత్స‌వం
– ఘ‌నంగా సామూహిక హ‌రిత‌హారం
– మొక్క‌లు నాటిన వైస్ చైర్ ప‌ర్స‌న్, కౌన్సిల‌ర్లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వ‌జ్రోత్స‌వాలలో భాగంగా స‌ర్కారు పిలుపు మేర‌కు తాండూరులో సామూహిక వ‌నోత్స‌వంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఆదివారం మున్సిప‌ల్ ప‌రిధి 7వ వార్డులో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, ఫ్లోర్ లీడ‌ర్ శోభారాణి, కౌన్సిల‌ర్లు హాజ‌రై మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంత‌రం ప‌లువురు మాట్లాడుతూ భార‌త దేశ స్వాతంత్ర్యంలో భాగంగా ప్ర‌భుత్వం సామూహిక వ‌న మ‌హోత్స‌వం ద్వారా ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు దృష్టిసారించింద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రు భాగ‌స్వాములై మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిల‌ర్లు ప‌ట్లోళ్ల నీర‌జాబాల్ రెడ్డి, మంకాల రాఘ‌వేంద‌ర్, బోయ ర‌విరాజు, మ‌మ‌త‌, సంగీత ఠాకూర్, వెంక‌న్న‌గౌడ్, ముక్తార్, మున్సిప‌ల్ అధికారులు నీర‌టి శ్రీ‌నివాస్, ప్ర‌వీణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.