మరో మూడు రోజులు వర్షాలు

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మరో మూడు రోజులు వర్షాలు
– పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
– వికారాబాద్‌ జిల్లాకు కూడా
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న మరో మూడు ప్రభావం కొనసాగుతుందని ప్రకటించింది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో కొనసాగుతూ, సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెడల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ వనపర్తిలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి…

అర్హులైన పేదలకే క్రమబద్దీకరణ పట్టాలు
– జీఓ 58, 59లతో అర్హులకు భరోసా
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
https://dharshininews.com/16974