కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి
– ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– కట్ట మైసమ్మ దేవాలయంలో భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కట్టమైసమ్మ తల్లీ కృప అందరిపై మెండుగా ఉండాలని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ విఠల్ నాయక్ లు అన్నారు.

గురువారం అమావాస్య, కార్తీక మాసం ముగింపు సందర్భంగా అమ్మవారి భక్తుడు ప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల బాల్ రెడ్డిలు దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలని వేడుకున్నారు. అమ్మవారి భక్తుడు ప్రకాష్ 3ఏండ్లుగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరోవైపు దేవాలయ ప్రాంగణంలో చైర్మన్ బాల్ రెడ్డి, నీరజారెడ్డిల వివాహా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

