బాబాయి కాదు కామాంధుడు
– 9 ఏండ్ల బాలికపై అత్యాచారయత్నం
– మామిడి కాయలు తీసుకొద్దామని చెప్పి మభ్య
– పోలీసులకు ఫిర్యాదు కుటుంబ సభ్యులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తండ్రి తరువాత బాబాయి వరుసలో ఉన్న ఓ కామాందుకు అభం శుభం తెలియని 9 ఏండ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్టేషన్ పరిధిలో సంచలనంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చన్గోముల్ పోలీస్టేషన్ పరిధి ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తి ఓ 9 ఏండ్ల బాలికకు బాబాయి వరుస అవుతాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన రాజు బాలికపై కన్నెశాడు. మామిడి పండ్లు తీసుకవద్దామని మాయమాటలు చెప్పి బాలికను పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే బాలికపై అత్యాచారా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చన్గోముల్ పోలీసుటకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అయితే అభం శుభం తెలియని 9 ఏండ్ల బాలికపై అత్యాచారాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విచారణలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
పైలెట్ పెద్ద మనసు..!
– మైనార్టీల కోసం రూ. 7.31 కోట్లు కేటాయింపు
– నిధుల మంజూరు ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– కృతజ్ఞతలు తెలిపిన అఫ్పూ(నయూం)
https://dharshininews.com/16983

