పెండింగ్ కేసులు త్వరగా క్లీయర్ చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పెండింగ్ కేసులు త్వరగా క్లీయర్ చేయాలి
– నేర విచారణకు టెక్నాలజీ వినియోగించాలి
– తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– యాలాల పోలీస్టేషన్ను సందర్శించిన డీఎస్పీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు. గురువారం యాలాల పోలీస్టేషన్ ను డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి సందర్శించారు.

స్టేషన్ లో పలు విభాగాలను పరిశీలించి.. రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరాలని అన్నారు. నేరాల విచారణ కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి ఓపెన్ డ్రింకింగ్ వంటి వాటిని నిర్మూలించాలని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఎవరైనా మత్తు ప్రదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎదైనా అసాంఘీక కార్యకలాపాలు జరిగితే.. ఇతర వాటిపై డయల్ 100కు ఫోన్లు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని భరోసా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మహిళ కూలికి పాము కాటు..!