జర్రయితే.. కాటేసేది..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

జర్రయితే.. కాటేసేది..!
– పాము నుంచి తప్పించుకున్న బాలిక
– వైరల్ అయిన వీడియో
దర్శిని డెస్క్‌: మాటు వేసి కాటు వేయడం పాములకు అలవాటే. అలాంటి పాము కాటు నుంచి పాప అదృష్ట వశాత్తు తప్పించుకుంది. అప్పటికే పాము తలెత్తి కాటేసేందుకు సిద్దమయ్యింది. కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. సీసీ టీవీలో నమోదైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక (Karnataka) బెళగావి జిల్లాలోని ‘హలగా’ గ్రామంలోని ఓ ఇంటి గుమ్మం దగ్గర బుసలు కొడుతున్న పామును గమనించని బాలిక.. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కాటువేసేందుకు చూసింది. కొద్దిసేపు గుమ్మం డోర్ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని, లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇది కూడా చదవండి…
మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌
– రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం
– గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం
https://dharshininews.com/17490

chaithany collage