జేబుల్లో గంజాయి పొట్లాలు..!
– గుట్టుగా విక్రయాలు, ముగ్గురిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
– కేసులు నమోదు, రిమాండుకు తరలింపు
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. జేబుల్లో ఉంచుకుని గుట్టుగా గంజా విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను తాండూరు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. శనివారం తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాదర్ కేసు వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో సీఐ బాలగంగాదర్, బృందం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో అనుమానాదస్పంగా కనిపించిన యుగేందర్, కార్తీక్, ఎండీ సమీర్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద జేబుల్లో సుమారు 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వారిని ఎక్సైజ్ పోలీస్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండుకు తరలించినట్లు సీఐ బాలగంగాదర్ తెలిపారు. మరోవైపు గంజాయి సేవిస్తున్న వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. గంజాయి సేవించడం వల్ల కలిగే దుష్ర్పభావాలను వివరించారు. తమ పిల్లలను గంజాయి మత్తుకు బానిసలు కాకుండా దృష్టి సారించాలని సూచించారు. ఈ సోదాలలో ఎక్సైజ్ ఎస్ఐలు రవికుమార్, నిజాముద్దీన్, సిబ్బంది భీమయ్య, రవి కిషోర్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

