వీడు.. మహా పాపాత్ముడు..!
– నాయినమ్మను కాలుతో తన్నుతూ దాడి
– మద్యం కోసం ఫించన్ డబ్బులు ఇవ్వలేదని ఘాతుకం
– పెద్దేముల్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి: సొంత నాయనమ్మపై కాలుతో తన్ని పాపాన్ని మూటగట్టుకున్నాడు.. ఈ పాపాత్ముడు. మద్యం కోసం తన ఫించన్ డబ్బులు ఇవ్వలేదని బూతు మాటలు తిడుతూ.. చావబాదాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాయినమ్మను చితకబాదుతున్న వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో సింది యశోదమ్మ తన మనుమండ్లతో కలిసి జీవనం సాగిస్తుంది. కుమారుడు చాల రోజుల క్రితమే మరణించారు. కోడలు కూడ కన్నుమూసింది. ఉన్న ముగ్గురు మనుమండ్లలో ఒకరు మరణించగా.. మనుమరాలికి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఇద్దరు మనుమండ్లతో కలిసి జీవిస్తుంది. ఇద్దరు మనుమండ్లు పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే యశోధమ్మకు ప్రభుత్వం ఇస్తున్న వృద్ధ్యాప్య ఫించనే ఆధారం. మూడు రోజుల క్రితం తనకు వచ్చిన ఫించన్ డబ్బులను పెద్ద మనుమడు గోవర్దన్ తీసుకున్నాడు. ఓ రూ. 600లు తన వద్ద ఉంచుకుంది. తీసుకున్న డబ్బులు అయిపోవడంతో గోవర్దన్ రెండు రోజుల క్రితం నాయినమ్మతో గొడవ పెట్టుకున్నాడు. మద్యం కోసం దాచుకున్న డబ్బులు ఇవ్వాలని వాదన పెట్టుకున్నాడు. ఇందుకు యశోదమ్మ నిరాకరించడంతో కోపంతో నాయినమ్మను కాలుతో తన్ని దాడి చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చావబాదాడు. తమకు సేవలు చేస్తుందన్న సోయి.. జ్ఞానం లేకుండా తంతూనే వచ్చాడు. శుక్రవారం ఉదయం నుంచి ఈ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. ఓరీ.. నీ పాపాత్ముడా అంటూ నాయినమ్మను తంతున్న మనుమడికి చూసిన వాళ్లంతా శాపనార్థాలు పెట్టారు.
వీడియో కింద చూడండి..
https://youtube.com/shorts/CucuZyEXYco


