తెంగాణకు వర్షసూచన

టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెంగాణకు వర్షసూచన
– మూడు రోజుల పాటు వానలు
– ప్రకటించిన వాతావరణ కేంద్రం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో స్థిరంగా ఉన్నట్లు వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్‌ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీంతో పాటు వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు.

ఇది కూడా చదవండి…

బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి శుభవార్త..!

లోకల్‌ యాడ్స్ కోసం కింద చూడండి..