పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!
– ఘనంగా నూతన గృహ ప్రవేశం
– రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి సబితారెడ్డి
– వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి
– ఆశీస్సులు చెప్పిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు కనివిని ఎరుగని రీతిలో అదుర్స్ అనేలా జరిగాయి. నూతన గృహప్రవేశ వేడుకలు అంతే అట్టహాసంగా కొనసాగాయి.

బుధవారం తాండూరు పట్టణంలోని చంద్రథియేటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఇంట్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తీ రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, తల్లి, జెడ్పీటిసి ప్రమోదిని రెడ్డితో పాటు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య గృహా ప్రవేశ వేడుకలు జరిగాయి. అదేవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచే నూతన నివాసం వద్ద పైలెట్ రోహిత్ రెడ్డి వేడుకలు ప్రారంభమయ్యాయి.

బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తదితరులు తరలివచ్చి శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, సీనీయర్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయదేవి, వరాల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ రంగారావు, నరుకుల నరేందర్ గౌడ్, పోటీ మహారాజ్ దేవాలయ చైర్మన్ తర్లపల్లి భానుకుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, బీఆర్ఎస్ బీసీ సెల్ కార్యదర్శి చంటి యాదవ్ తదితరులు ఎమ్మెల్యేకు జన్మదిన, నూతన గృహాప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదినం, నూతన గృహా ప్రవేశ వేడుకల సందర్భంగా తాండూరు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, గ్రామీణ ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు 30 వేల మంది ఒకేసారి తరలిరావడంతో వేడుకల కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణం కిక్కిరిసి పోయింది.

లోకల్‌ యాడ్స్ కోసం కింద చూడండి..