విద్యుత్ జరిమాన.. కక్ష్యపూరితం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యుత్ జరిమాన.. కక్ష్యపూరితం..!
– వినాయక ఆసుపత్రిపై అన్యాయంగా రూ. 5లక్షల ఫైన్‌
– తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– వినియోగదారుల దినోత్సవంలో ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలను పేరుతో విద్యుత్ అధికారులు తమ ఆసుపత్రిపై కక్ష్యపూరితంగా జరిమానాలు విధించారని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అరోపించారు.

మంగళవారం తాండూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో విఠల్ నాయక్ పాల్గొని ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణం శాంతినగర్‌లో వినాయక ఆసుపత్రి కొనసాగిస్తున్నామని తెలిపారు.

అయితే ఆసుపత్రిపై ఒక ఫ్లోర్ అధికంగా ఉందని.. నిబంధనలకు విరుద్దంగా కొనసాగిస్తున్నారని పేర్కొంటూ తమ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీస్టేషన్, ఆసుపత్రితో పాటు ఎక్కడైతే ప్రజలకు అత్యవసర సేవలు అందించే సంస్థలపై విద్యుత్ ఆంక్షలు, చర్యలు తీసుకోరాదని సుప్రీం కోర్టు ప్రత్యేక జీవో జారీ చేసిందని తెలిపారు.

అయినప్పటికి తాండూరు విద్యుత్ అధికారులు అన్యాయంగా.. రాజకీయ కక్ష్యపూరితంగా వినాయక ఆసుపత్రిపై రూ. 5లక్షల జరిమాన విధించారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆసుపత్రిపై విధించిన జరిమానాను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..!