300ల కంపెనీలో ఉద్యోగాలు..!

కెరీర్ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

300ల కంపెనీలో ఉద్యోగాలు..!
– ఇంటి వద్ద కూర్చోనే దరఖాస్తు
– జిల్లా వికలాంగులకు అవకాశాలు
– అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఇంటి వద్దే వికలాంగులకు ఇది గొప్ప శుభవార్త. ఏకంగా 300 కంపెనీలలో ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూత్‌ ఫర్ జాబ్స్ అనే సంస్థ ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది.
kvcs
అన్ని ఉన్న అభ్యర్థులే కంపెనీల చుట్టూ తిరిగి ఉద్యోగాల కోసం కష్టపడున్నారు. అలాంటిది వికలాంగులకు ఇంకా ఎన్ని కష్టాలు ఉంటాయో అని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టల్‌లో ఇంటి వద్ద నుంచే ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయా కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను సాధించుకోవచ్చు.

నమోదు ఇలా..
https://pwdjobportal.telangana.gov.in/ (ఈలింక్‌పై క్లిక్ చేయొచ్చు) రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతి ధ్రువ పత్రం ఆధారంగా పేరు, చర వాణి నంబరు, ఈ-మెయిల్ ఐడీ, దివ్యాంగ సదరం ధ్రువ పత్రం, ఏ విభాగం, శాతం తదితర వివరాలు నమోదు. చేయాలి. అర్హతలను బట్టి అందులో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా ఆ పోర్ట ల్లో ఉన్న 300 కంపెనీలు, విద్యార్హతలు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని సరి పడా ఉద్యోగం అందించను న్నారు. దీంతో దివ్యాంగులు ఇంటి వద్ద కూర్చొని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందొచ్చు.

ఇదికూడా చదవండి…

షాడో.. కాదు.. సేవకుడు..!