బాబోయ్.. భౌ భౌ..!

తాండూరు వికారాబాద్

బాబోయ్.. భౌ భౌ..!
– రెచ్చిపోతున్నవీధి కుక్క‌లు
– ప‌ట్ట‌ణ వాసుల్లో పెరుగుతున్న‌ ఆందోళ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలో గ‌త కొన్ని రోజుల నుంచి వీధి కుక్క‌ల బెడ‌ద ఎక్కువైపోయింది. ఒక‌టి కాదు.. రెండు కాదు.. గుంపులు గుంపులుగా సంచ‌రిస్తున్నాయి. భౌ భౌ మంటే చాలు అటు వెళ్లే ప్ర‌జ‌లు బాబోయ్ అంటూ బెంబేలెత్తి పోతున్నారు. ఒక్క‌సారిగా మీద‌కు దూకి గాయాలు చేస్తున్న సంఘ‌ట‌న‌ల‌తో ప‌ట్ట‌ణ వాసుల్లో ఆందోళ‌న రోజు రోజుకు పెరిగిపోయింది.
కొన్ని రోజుల క్రితం మార్వాడి బ‌జార్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారంతో 14 మంది గాయాల‌పాల‌య్యారు. తాజాగా అదే మార్వాడీ బ‌జార్ ప్రాంతాంలో వీధి కుక్క‌ల దాడిలో ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు గాయాల‌తో ఆసుప‌త్రి పాల‌య్యారు. వీధి కుక్క‌లతో ప్ర‌జ‌లు బెంబేలెత్తున్నా సంబంధిత అధికారులు ప‌ట్టించుకోవడం లేంద‌టూనే.. మ‌రోపక్క ప్రజా ప్ర‌తినిధుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.