ఘ‌నంగా సీఐ జ‌లంధ‌ర్‌రెడ్డి వీడ్కోలు స‌మాశం

తాండూరు వికారాబాద్

ఘ‌నంగా సీఐ జ‌లంధ‌ర్‌రెడ్డి వీడ్కోలు స‌మాశం
– స‌న్మానించిన డీఎస్పీ, నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బ‌దిలీపై వెళ్లిన తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్‌రెడ్డికి అధికారులు, నాయ‌కులు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. సోమవారం తాండూరు పట్టణ సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్లో తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి బదిలీ వీడ్కోలు సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్సీ లక్ష్మీనారాయణతో పాటు పోలీసులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సీఐ జలంధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ రాంబాబుకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డీఎస్సీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి తన పదవి కాలంలో సమర్థవంతంగా విధులు చేపట్టి అధికారులు, ప్రజల మన్నన్నలను పొందడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో భాగమైన పోలీసులకు బదిలీలు, పదవి వి రమణలు సర్వసాధారణమన్నారు. అదేవిధంగా బదిలీపై వెళుతున్న సీఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారులు, ప్రజలు, నాయకుల సహాకారంతో సుదీర్ఘంగా 32 నెలల పాటు సేవలందించడం జరిగిందన్నారు. ఇందులో అందరి సహకారం మరువలేనిదన్నారు. మరోవైపు నూతన సీఐ రాంబాబు మాట్లాడుతూ సీఐ జ‌లంధర్ రెడ్డికి సహాకారం అందించినట్లుగా అందరు తనకు సహాకారం అందించాలని కోరారు. తనవంతు బాధ్యతగా విధులు నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, జెడ్పీటీసీలు గౌడి మంజుల మంజుల వెంకటేశం, శ్రీనివాస్ రెడ్డి, ధారాసింగ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నరేందర్ రెడ్డి, తాండూరు ఎఫ్ఆర్వో శ్యాంసుందర్ రావు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. సుధాకర్, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, విద్యాచరణ్ రెడ్డి, అరవింద్, టీఆర్ఎస్ తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, సర్పంచులు రాజప్ప, రాములు, బిడే నాగప్ప, ఎంపీటీసీ రవిశిందే, సీనియర్ నాయకులు పటేల్ ఉమాశంకర్, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగా రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, న్యాయవాది గోపాల్, సీపీఐ నాయకురాలు విజయలక్ష్మీ పండిత్, పలువురు నాయకులు, అభిమానులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.