అభివృద్ధి, సంక్షేమమే.. బీజేపీ ధ్యేయం..!
– దీన్ దయాల్ ఆక్షాంక్ష మేరకు మోడీ పాలన
– తాండూరులో బీజేపీ నేతల సహపంక్తి భోజనాలు
– పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, సీనీయర్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమమే బీజేపీ ధ్యేయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.రాజశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. గురువారం ప్రధాని మోడి జయంతి ఉత్సవాలతో పాటు దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు.

బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని 19వ వార్డు సీతారాంపేట్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు జిల్లా అధ్యక్షులు డా.రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్త, పలువురు సీనీయర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం 148,149 బూత్ లలో సామాజిక ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడి పాలన చేస్తున్నారని అన్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన దీన్ దయాల్ ఆకాంక్షను బీజేపీ నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, సుదర్శన్ గౌడ్, ఎస్సీ మోర్చ్ పట్టణ అధ్యక్షులు మ్యాతరి లాలయ్య, బూత్ అధ్యక్షులు విక్రాంత్, బోరే అంబదాస్, ప్రమోద్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

