ఉగ్ర కాగ్నా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉగ్ర కాగ్నా..!
– పరవళ్లు తొక్కిన నది
– ఉదృతంగా ప్రవహించిన తాండూరు, కోకట్ వాగులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు కాగ్నానది ఉగ్రరూపం దాల్చింది. నిండుగా ప్రవహిస్తూ పరవళ్లు తొక్కింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో తాండూరుతో పాటు కోకట్ కాగ్నా వాగులు ఉదృతంగా ప్రవహించాయి. గత వారం కూడా కురిసిన భారీ వర్షాలకు తాండూరు, కోకట్ కాగ్నావాగుల్లో భారీగా వరద పొటెత్తింది. అప్పుడే నిండుగా ప్రవహించిన కాగ్నా వాగు తాజాగా చేరిన వరధతో ఉగ్రరూపంను సంతరించుకుంది. తాండూరు కాగ్నానదిలో పాత వంతెన పూర్తిగా నిండి ప్రవహించింది. ఆనవాళ్లు కనిపించనంతగా నీరు నిండుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా నీరు రావడం.. ఉదృతంగా ప్రవహించడం కనిపించింది. మరోవైపు కోకట్ కాగ్నావాగు సైతం ఉప్పొంగి ప్రవహించింది. వరద ఉదృతితో అటు.. ఇటు రాకపోకలు స్థంభించాయి. ఈ విషయం తెలిసిన ప్రజలు కాగ్నా పరవళ్లను తిలకించేందుకు తరలివచ్చారు. సెల్పీలు, వీడియోలతో సందడి చేశారు. కింద వీడియో ఉంది చూడండి..

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage