పత్తి కొనుగోలు కేంద్రాలు రెడీ..!
– అవకతవకలు లేకుండా ప్రత్యేక యాప్
– ఈసారి క్వింటాల్ మద్దతు ధర ఎంతంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు కోసం అధికారులు కేంద్రాలను సిద్దం చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ మార్కెట్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి సారంగపాణి కేంద్రాల వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఈ సారి సీసీఐ ఏర్పాటు చేసే 14 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాండూరు. పరిగి, వికారాబాద్ విపణుల పరిధిలో ఒక్కో మూడేసి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయనుందని చెప్పారు. కోట్పల్లి పరిధి 2, కొడంగల్, మర్పల్లి, ధారూర్లో కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. క్వింటా నాణ్యమైన పత్తికి కొనుగోలు కేంద్రంలో రూ.8,110 చెల్లిస్తారన్నారు. మద్యరకంకు రూ. 7710లు చెల్లించడం జరుగుతుందని అన్నారు.

పత్తి కొనుగోలులో అవకతవకలు జరగకుండా ఈసారి ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. జిల్లాలోని 20 మండ లాల్లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,44,390 ఎకరాలకు 2,54,505 2 సాగైందన్నారు. గతేడాది రైతులు కొనుగోలు కేంద్రాల్లో కేవలం 80 వేల మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే విక్రయించారన్నారు. ఈసారి 2.62 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని రైతు నుంచి కొనుగోలు చేస్తారని అంచనా వేస్తూ న్నట్లు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధి కారి సారంగపాణి తెలిపారు.

ఇదికూడా చదవండి…

