ఎమ్మెల్సీ.. యూటర్న్‌..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్సీ.. యూటర్న్‌..!
– పోటీ చేయాల్సిందే అంటున్న వర్గం
– మహేంద్రుడి ముందడుగుపై సర్వత్రా టెన్షన్‌
– రేపు చైర్ పర్సన్, కౌన్సిలర్లతో ప్రత్యేక భేటి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులో మహేంద్రుడు ముందడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మహేందర్ రెడ్డికి టిక్కెట్టు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం మహేందర్ రెడ్డిని వదులుకోలేక మంత్రి పదవిని ఆఫర్‌ ఇస్తున్నారనే ఊహాగానాలు చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు తగ్గట్లుగానే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై బుజ్జగింపులు అధికం కావడంతో ఇచ్చిన ఆఫర్‌తో సరిపెట్టుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని నమ్ముకున్న వర్గం నేతలు మాత్రం ఇందుకు అంగీకారం తెలపడం లేదు. పార్టీలోనే చివరి క్షణం వరకు టిక్కెట్టు కోసం ప్రయత్నించాలని, లేదంటే ఆఫర్ తీసుకోకుండా యూటర్న్‌ తీసుకోవాలని వర్గం నేతలు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకస్తున్నట్లు సమాచారం.

అటు కుటుంబంలో కూడా మెజార్టీ నిర్ణయం యూటర్న్‌ తీసుకోవాలని బలంగా వినిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టిక్కెట్టు రాకపోతే కాంగ్రెస్‌లో చేరాలని, తాండూరు బరిలో ఉండాల్సిందే అంటూ మెజార్టీ నేతలు ఒత్తిడి తీసుకవస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో మహేందర్ రెడ్డి ఎటు తేల్చుకోవాలో డైలామాలో పట్టడ్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాలకు చెందిన ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులను ఒకే చోటకు పిలిపించి సర్దిచెప్పేందుకు ఎంపీ రంజిత్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. పార్టీ పదవులతో పాటు నామినేటేడ్‌ పదవులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కేటాయింపు ఎమ్మెల్య్డే, ఎమ్మెల్సీలకు చెరిసగం ఇచ్చే విధంగా కూడా మంత్రి హరీ్‌షరావు సమక్షంలో ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. గత 25 రోజులుగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో హైదరాబాద్‌లోనే రాయబారాలు, ఒప్పందాలు జరుగుతున్నాయి.

రేపు చైర్ పర్సన్, కౌన్సిలర్లతో భేటి
మరోవైపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు నేతలు, కార్యకర్తలతో అసెంబ్లీ బరిలో పోటి విషయంలో అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా రేపు బుధవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, ఆయన వర్గం కౌన్సిలర్లతో సమావేశం అయ్యేందుకు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌కు ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!