సుపరిపాలనే కాంగ్రెస్ ధ్యేయం..!
– రేవంత్ రెడ్డి సహాకారంతో అభివృద్ధిపై దృష్టి
– తాండూరును మోసిన మాజీ ఎమ్మెల్యే
– మనోహర్ రెడ్డిని గెలిపించిన వారందరికి కృతజ్ఞతలు
– టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సుపరిపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా ముందుకు సాగుతుందని ఆ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేస్ మహారాజ్ అన్నారు.. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ తో పాటు శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు అభివృద్ధి అనే ఏడో గ్యారేంటీని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో వికారాబాద్ జిల్లాతో పాటు తాండూరు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పక్క నియోజకవర్గంలో ఉన్న రేవంత్ రెడ్డి సహాకారంతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రూపురేఖలు మారుస్తారని అన్నారు. అర్హులైన అందరికి ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుంద ని’ అన్నారు. మచ్చలేని రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ బాధ్యతను నిలుపుకుంటామన్నారు. మనోహర్ రెడ్డి గెలుపుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భూకబ్జాలు, కమీషన్ల వసూళ్లకు పాల్పడి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీయడంతో గెలిచిందని అన్న రోహిత్ రెడ్డి గతంలో రాష్ట్రమంతా బీఆర్ఎస్ గాలి వీచినా కూడా తనను గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరిచిపోవడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, నాయకులు జనార్దన్ రెడ్డి, బీమయ్య, మండల అధ్యక్షులు నాగప్ప, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

