పైలెట్‌కు తిరుగులేదు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌కు తిరుగులేదు..!
– తాండూరులో భారీ మెజార్టీ ఖాయం
– రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తిరుగులేదని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని బీఆర్ఎస్ సీనీయర్ నేతలు అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర రావడంతో హర్షం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మొదటిసారి బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పెద్దేముల్ ఏఎఫ్‌సీఏస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను ఎత్తుకుని పైలెట్ రోహిత్ రెడ్డి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో తిరుగులేని ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి గెలవడం ఖాయమన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుని మంత్రిగా చూసుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి…

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!