శ్రీ సాయి మేధలో ‘రక్షాబంధన్’ వేడుకలు..!
– ఒకరికొకరు రాఖీలు కట్టుకున్న విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపంగా భావించే రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం తాండూరు పట్టణం శివాజీచౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు.

”నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనమందరము దేశానికి, ధర్మానికి రక్ష” అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక రక్షాబంధన్ అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం విద్యార్థి దశను నుంచే ఉపాధ్యాయులు చక్కటి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి శ్రీ సాయి మేధ విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కల్పన, మంజుల రెడ్డి, ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

