ఎలక్షన్ కోడ్ ఆన్..!
– తాండూరులో ఫ్లెక్సీ, జెండాలపై కొరడా
– ఎక్కడిక్కడ తొలగింపు చేయించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఆన్ అయిపోయింది. ఎన్నికల నియామళీని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం సోమవారం ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
దీంతో మంగళవారం తాండూరు మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. రహదారుల వెంబడి ఉంచిన పార్టీల జెండాలను కూడా తొలగించారు. దీంతో తాండూరు పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయ్యిందని అందరు చర్చించుకున్నారు.
ఇది కూడా చదవండి…

