సద్దుల బతుకమ్మకు వేళాయే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సద్దుల బతుకమ్మకు వేళాయే..!
– ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
– తాండూరుకు వస్తున్న సింగర్ మధుప్రియ
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని తాండూరు పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. తాండూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ వేడులకు ప్రముఖ సినీ, జానపద సింగర్ మధుప్రియను ఆహ్వానించారు. ఆదివారం పట్టణంలో జరిగే కార్యక్రమానికి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. అట్టహాసంగా నిర్వహించబోతున్న సద్దుల బతుకమ్మ వేడులకు పట్టణంలోని వాడ వాడల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత