గుడిలో కన్నం వేసిన పాపిస్టులు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గుడిలో కన్నం వేసిన పాపిస్టులు..!
– జుంటుపల్లి సీతారామ స్వామి దేవాలయంలో చోరీ
– అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పవిత్రమైన సీతారాముల దేవాలయంలో కన్నం వేశారు దొంగ పాపిస్టులు. యాలాల మండలం జుంటుపల్లి క్షేత్రంలో వెలసిన శ్రీ సీతారాముల దేవస్థానంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తాండూరు నియోజకవర్గంలోనే జుంటుపల్లి సీతారాముల దేవాలయం ప్రసిద్ది గాంచింది. గత కొన్ని రోజులుగా ఈ దేవాలయంలో వరుస చోరీలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా గుర్తుతెలియని కొందరు వ్యక్తులు దేవాలయంలో చోరీ చేసిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి వెండి కీరీటాన్ని అపరిహరించినట్లు తెలిసింది. అంతేకాకుండా దేవాలయంలోని హుండీలో నగదును కూడా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దేవాలయంలో అధికారుల నిఘా వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా వరుస చోరీలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన చోరీ సంఘటనపై యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదికూడా చదవండి…

ఆధార్‌కు లాక్‌ ఏద్దాం..!