తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
– వికారాబాద్ ఎమ్మెల్యేకు దక్కిన గౌరవం
– రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ఇదే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్ కుమార్.. గతంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అలాగే, 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచారు.

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి హాయాంలో చేనేత, జౌళీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో మరోసారి ఆయనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా సముచిత స్థానం దక్కింది. గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికకావడం పట్ల వికారాబాద్‌ తో పాటు జిల్లా వాసులు అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!