లైబ్రరీ చైర్మన్లకు షాక్..!
– పదవులు రద్దుకు ఉత్తర్వులు
– 33 జిల్లాల పేర్లను ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని లైబ్రరీ చైర్మన్‌లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో 33 జిల్లాలలో చైర్మన్ పదవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీస్ యాక్టు-1960 కింద జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నామినేట్ పదవులతో పాటు నాన్ ఆఫిషీయల్ సభ్యుల పదవులను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిరాల, నిర్మల్, హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, నల్గొండ, మహబూబ్ నగర్, సూర్యపేట్, యాదాద్రి, నిజామాబాద్, కామారెడ్డి, మెడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, భూపాలపల్లి, మహబూబ బాద్, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాలకు గ్రంథాలయ సంస్థల చైర్మన్లను పదవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇదికూడా చదవండి…

