trafic chalan

వాహనదారులకు గుడ్ న్యూస్…!

క్రైం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

వాహనదారులకు గుడ్ న్యూస్…!
– ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు
– మరో చాన్స్ ఎప్పటి వరకు ఉంటుందంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు నేటి అర్థరాత్రితో ముగియనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆఫర్ గడువును పెంచుతూ మరో చాన్స్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల గడువును ఈ నెల 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీని ప్రకటించగా, బైక్‌లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గడువు దగ్గరపడటం.. చలానా చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం