రండి.. మోడల్‌ స్కూళ్లో చేరండి..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

రండి.. మోడల్‌ స్కూళ్లో చేరండి..!
– 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం
– పై తరగతుల ఖాళీల భర్తికి కూడా అవకాశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లో చేరేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తాండూరు మండలం జినుగుర్తి సమీపంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వై.ప్రకాష్ తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం 2024-25కు గాను 6వ తరగతిలో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఇందుకు వచ్చే నెల 22వ తేది వరకు గడువు ఉందన్నారు. అదేవిధంగా మోడల్ స్కూళ్లో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తి చేసేందుకు దరఖాస్తులు కోరడం జరుగుతుందన్నారు. వచ్చే ఏప్రిల్ 7వ తేదిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!