బాల్య వివాహము అడ్డగింత

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బాల్య వివాహము అడ్డగింత
– తాండూరు మండలంలో ఘటన
– వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వయస్సు నిండకుండా చేస్తున్న బాల్య వివాహాన్ని కరణ్ కోట్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన తాండూరు మండలంలో జరిగింది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోటబాస్పల్లికి చెందిన అబ్బాయితో కర్ణాటక రాష్ట్రం చించొల్లి తాలూకా మిర్యాణం గ్రామానికి చెందిన అమ్మాయితో సోమవారం వివాహాము జరిపించేందుకు నిర్ణయించారు.

బాల్య వివాహాము కావడంతో పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుకుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం చైల్డ్ లైన్ కమిటి వద్దకు పంపినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు, అబ్బాయిలకు పెండ్లి వయస్సు రాకుండా బాల్య వివాహాలు చేస్తే చట్ట రిత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు